సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలింగ్ కేంద్రాలను పునఃపరిశీలించిన కమిషనర్

18 గంటల క్రితం

Commissioner re-examines polling stations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 03:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, అనంతపురము నగరపాలక సంస్థ పరిధిలోని 62 డివిజన్లకు సంబంధించిన 245 పోలింగ్ కేంద్రాలపై వచ్చిన క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలకు సంబంధించి ఆదివారం అభ్యంతరాలు ఉన్న పోలింగ్ కేంద్రాలను కమిషనర్ జస్వంత్ రావు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించారు. కమిషనర్ జశ్వంత్ రావు మాట్లాడుతూ అభ్యంతరాలు ఉన్న పోలింగ్ కేంద్రాలైన జీసస్ నగర్ లోని అరవింద్ ఘోష్ మున్సిపల్ స్కూల్, నాయక్ నగర్ లోని ఫాదర్ విన్సెంట్ మున్సిపల్ స్కూల్ మరియు 6వ రోడ్డులోని ఆదర్శ లర్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తదితర ప్రాంతాలలో 16 పోలింగ్ కేంద్రాలను టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి ఓంకార్ , టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్