శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాఠశాలలో విద్యార్థినిపై ఉన్మాది దాడి

3 గంటల క్రితం

Deranged individual attacks a female student at school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 11:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాప్తాడు (అనంతపురం) : రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కలకలం చోటుచేసుకుంది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది చెక్క మొద్దులు కోసే మిషన్‌తో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో గోపిక లక్ష్మి అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ దాడి ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థినిపై దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్