శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నాలుగో కోడి వ్యవహారంపై చర్చ

6 రోజుల క్రితం

kodi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 07:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పుట్లూరు(అనంతపురం) : మండల పరిధిలోని మడుగుపల్లె గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో ఆదివారం కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న వారు పోలీసులను గమనించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 39 ద్విచక్ర వాహనాలు, మూడు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సీఐ, ఎస్‌ఐలు 30 మందితో పాటు 39 మోటార్‌సైకిళ్లు, మూడు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే, నాలుగో కోడి కూడా ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. పోలీసులు మాత్రం దానిని అధికారికంగా వెల్లడించకుండా రెస్టు రూములో దాచి ఉంచారని కొందరు ఆరోపిస్తున్నారు. నిజాయితీ, న్యాయానికి ప్రతీకగా భావించే పోలీసు వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్