బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎట్టకేలకు అగ్రహారం అంగన్వాడీ కేంద్రానికి తాగునీరు

12 సెప్టెంబర్, 2026

water.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి–కలకడ/సంబేపల్లి: ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు అధికారులు, స్థానిక నాయకులు స్పందించడంతో ఎట్టకేలకు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎస్‌. సోమవరం పంచాయతీ పరిధిలోని అగ్రహారం అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు. అగ్రహారం అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలకు తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రజాశక్తి దినపత్రికలో ‘అగ్రహారం అంగన్వాడీ కేంద్రంలో తీవ్ర నీటి ఎద్దడి’ శీర్షికన ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ సూపర్‌వైజర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ స్పందించి సమస్యను స్థానిక టీడీపీ ఎంపీటీసీ రవీంద్రనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన రవీంద్రనాయుడు తన సొంత నిధులతో దెబ్బతిన్న పైపులైన్‌కు మరమ్మతులు చేయించారు. గ్రామం నుంచి పాఠశాల వరకు దెబ్బతిన్న పైపులైన్‌ను గుర్తించి మరమ్మతులు చేయించడంతో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రం, పాఠశాలకు విద్యుత్‌ సౌకర్యం కూడా లేకపోవడంతో రవీంద్రనాయుడు స్పందించి విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు ప్రజల సమస్యలపై వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరారు. తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో అంగన్వాడీ కేంద్రం కార్యకర్త సరస్వతి, సహాయకురాలు సులోచన, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ రవీంద్రనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. పైపులైన్‌ మరమ్మతుల కార్యక్రమంలో ఆలయ వెంకటరమణ, చంద్రబాబునాయుడు, సైఫుల్లా, సయ్యద్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్