సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మహాలయ పౌర్ణమి పై ఎల్ నినో ఎఫెక్ట్ - పండగ చేయని రైతన్నలు

18 గంటల క్రితం

El Niño Effect on Mahalaya Purnima – Farmers Forgo Celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నార్పల లో బోసిపోయిన మటన్, చికెన్ మార్కెట్..!


ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : ఈ ఏడాది మహాలయ పౌర్ణమి వేళ ఎల్ నినో ప్రభావం నార్పల మండలంలో స్పష్టంగా కనిపిస్తోంది. సంవత్సరాని కి ఒకసారి జరిగే మహాలయ పౌర్ణమి నార్పల మండల కేంద్రంలోను మండలంలోని పలు గ్రామాల్లో మహాలయ పౌర్ణమిన రైతులంతా మేకలు పొట్టేలు కోళ్లు కోసి పండుగలా ఘనంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది ఆదివారం జరిగిన మహాలయ పౌర్ణమికి నార్పల లో మటన్, చికెన్ మార్కెట్లు కొనేవారు లేక బోసిపోయాయి. మార్కెట్ నిర్వాహకులు మహాలయ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడాది జరిగిన విధంగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుందని దుకాణాల ముందు ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసుకొని అదనంగా మాంసం కొట్టే మనుషులను పెట్టుకున్నారు. అయితే కొనేవారు లేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రెండు మూడు ఇండ్లు కలిసి మహాలయ పౌర్ణమికి మేకలు, పొట్టేలు కోసి అర్ధరాత్రి సమయంలోనే వంటలు చేసి గ్రామాల్లో హంగామా సందడి ఉండేది. అటువంటిది ఈ ఏడాది గ్రామాల్లో కోడి కోసేవారు కూడా కరువయ్యారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడక పంటలు పండక పెట్టిన పంటలు చేతికి రాక తీవ్ర నష్టాల్లో ఉన్న రైతన్నలు మహాలయ పౌర్ణమి పండగ చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ తదితర పండగల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని పలువురు మాంసం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్