ప్రజాశక్తి-గుత్తి
గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన మహేష్‌కుమార్ జాతీయస్థాయి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభను చాటారు. కళాశాలలో సిఎస్‌సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న మహేష్‌కుమార్ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో వారం రోజులపాటు జాతీయస్థాయి వందేమాతరం క్యాంపు నిర్వహించారు. ఆ క్యాంపులో మహేష్ కుమార్ ఉత్తమ ప్రతిభను కనబరిచి ప్రశాంశ పత్రాన్ని అందుకున్నారు. దీంతో గురువారం కళాశాలలో యాజమాన్యం మహేష్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ వికె.పద్మావతమ్మ మాట్లాడుతూ మహేష్ కుమార్ సాధించిన విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమన్నారు. దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నమ్రత, ఎన్ఎస్ఎస్ అధికారి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)