గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో ఆదర్శ కుటుంబం : విక్టరీ వెంకటేష్

1 గంట క్రితం

GANI2978.jpg.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 07:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు.

20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అక్టోబర్‌ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. "మీడియా మిత్రులను ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంటారు. ఇప్పుడు మా ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను కూడా అదే ఉత్సాహంతో సపోర్ట్ చేయడానికి రావడం ఆనందాన్ని ఇస్తోంది. ‘ఆదర్శ కుటుంబం’ సినిమాను మేము చాలా కొత్తగా ప్రయత్నించాము. త్రివిక్రమ్ ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. థియేటర్లలో ప్రేక్షకులంతా గొప్ప అనుభూతిని పొందుతారు. ఈ సినిమా మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచకుండా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో అలరిస్తుందని నమ్ముతున్నాము. మేము కొత్తగా ప్రయత్నించిన ఈ ఆసక్తికర కుటుంబ కథా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. రేపు థియేటర్లలో కలుద్దాం. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీ అందరికీ నచ్చుతుందని, మీరందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని, ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల తర్వాత ఓ అద్భుతమైన కథతో రావాలనే ఉద్దేశంతోనే ఇంత సమయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’తో మీ ముందుకు వస్తున్నాం." అన్నారు.


ప్రముఖ నటుడు నారా రోహిత్ మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు ముందుగా త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి అద్భుతమైన సినిమాలు. ఎన్నోసార్లు చూశాను. అలాంటి కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. షూటింగ్ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను." అన్నారు.


కథానాయిక శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు. రేపు థియేటర్లకు వెళ్లి మా ఆదర్శ కుటుంబం సినిమా చూడండి. మీరంతా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతఙ్ఞతలు." అన్నారు.


సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. "ఆదర్శ కుటుంబంలో నన్ను భాగం చేసిన త్రివిక్రమ్ గారికి కృతఙ్ఞతలు. ప్రతి విభాగం ఈ సినిమా కోసం మనసు పెట్టి పని చేసింది. త్రివిక్రమ్ గారి కలం బలం గురించి అందరికీ తెలుసు. ఇంక్ తో అందరినీ థింక్ చేసేలా చేస్తారు. ఒక సీన్ ని తన మాటలతో గొప్పగా మలుస్తారు. ఎనిమిది పాటలతో జ్యూక్ బాక్స్ విడుదల చేశాం. అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా ఫైనల్ కాపీ చూసి మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. వెంకటేష్ గారి లాంటి పాజిటివ్ వ్యక్తితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. శ్రీనిధి శెట్టి ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. నారా రోహిత్ గారు అద్భుతంగా నటించారు. రేపు విడుదలవుతున్న మా ఆదర్శ కుటుంబం సినిమాని మీ కుటుంబంతో కలిసి చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాం." అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్