హన్సి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మైలురాయి’. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా నటించారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నటుడు నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉందని, మంచి కథతో నిర్మాత హన్సిక తన ప్రయాణాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. మహిళలు చిత్ర నిర్మాణంలో చూపించే బాధ్యత, క్రమశిక్షణ గొప్పవని పేర్కొన్నారు. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న, ప్రియాంక, నిహారిక, సుప్రియల బాటలో హన్సిక కూడా పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత హన్సిక మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
Print Edition‘మైలురాయి’ టైటిల్ పోస్టర్ విడుదల
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 06:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)