తమిళ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఇటీవల ‘సిగ్మా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తాజాగా సంజయ్ హీరోగా పరిచయం కానున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘డ్యూడ్’ ఫేమ్ కీర్తిశ్వరన్ దర్శకత్వంలో, ప్రముఖ దర్శకుడు అట్లీ తన ‘ఎ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్’ పతాకంపై నిర్మించనున్న చిత్రంతో సంజయ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబుతో కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఈ కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హీరోగా జాసన్ సంజయ్ కొత్త సినిమా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 07:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)