ఆర్థోపెడిక్, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో: సి ఈ ఓ స్నేహారెడ్డి
ప్రజాశక్తి -అనంతపురం : నగర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఇండస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఈ నెల 19వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నట్లు సిఈఓ స్నేహారెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎద్దుల శివారెడ్డి రెడ్డి, డాక్టర్ ఎం అరుణ్ కుమార్ రెడ్డి సంయుక్తంగా మాట్లాడుతూ...అనంతపురం–బళ్లారి రహదారిలో నూతనంగా నిర్మించిన ఈ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్, మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇండస్ హాస్పిటల్‌ను ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎం.మదన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌లోని సన్‌షైన్ హాస్పిటల్స్‌లో ఫెలోషిప్ పూర్తి చేసిన ఆయన వెన్నెముక, కీళ్ల మార్పిడి, ఎముకల శస్త్రచికిత్సల్లో విశేష అనుభవం కలిగి ఉన్నారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని అన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గౌరవ అతిథులుగా పాల్గొంటారన్నారు. ప్రత్యేక అతిథులుగా హిందూపురం ఎంపీ బీకే పార్ధసారథి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్, జిల్లా ఎస్పీ పి. జగదీష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ఈ.బి. దేవి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారన్నారు. ఆసుపత్రి ప్రారంభానికి ఉరవకొండ టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు, ప్రముఖ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.వి. గురువరెడ్డి ప్రత్యేక సహకారం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.జిల్లా ప్రజలు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇండస్ హాస్పిటల్ నిర్వాహకులు కోరారు.







కామెంట్‌లు (0)