శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్లాస్టిక్‌ను నివారిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

5 గంటల క్రితం

palstic.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 09:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

ప్రజాశక్తి-కదిరి టౌన్‌: ప్లాస్టిక్‌ వినియోగాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. ‘‘ప్లాస్టిక్‌ వద్దు.. పేపర్‌ బ్యాగ్‌లు ముద్దు’’ అనే నినాదంతో ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం కదిరి పట్టణంలోని గర్ల్స్‌ హైస్కూల్‌ ఎదురుగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్‌ వినియోగం వల్ల సమాజానికి, పర్యావరణానికి కలుగుతున్న నష్టాలను ప్రజలకు వివరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే తెలిపారు. హోటల్‌ నిర్వాహకులు, దుకాణదారులు ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, వాటికి ప్రత్యామ్నాయంగా పేపర్‌ బ్యాగ్‌లు, పర్యావరణహిత వస్తువులను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ‘‘మన ఆరోగ్యం.. మన పర్యావరణం.. మన బాధ్యత’’ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కదిరి పట్టణాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. స్వచ్ఛమైన కదిరి.. ఆరోగ్యకరమైన కదిరి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పర్వీన్‌ భాను, మున్సిపల్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌, మున్సిపల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు త

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్