శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మానసిక ఆరోగ్యంపై అవగాహన..

1 గంట క్రితం

మానసిక ఆరోగ్యంపై అవగాహన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 06:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాప్తాడు : మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మానసిక ఆరోగ్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాలను తొలగించి, వారిలో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక మానసిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష 4వ జోన్ పీఎంయూ కోఆర్డినేటర్ ఛాయేంద్రకుమార్ విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, భయాలు, ఆందోళనలు, విద్యాపరమైన ఒత్తిడి, తదితర అంశాలపై చర్చించి తగిన సూచనలు అందించారు. ‘లుక్-లింక్’ విధానం ద్వారా విద్యార్థుల్లో భయాందోళనలను తగ్గించుకోవడం, సమస్యలను గుర్తించడం, బాధితులకు తగినసాయం అందించడం వంటి అంశాలను వివిధ కార్యక్రమాలు, యాక్టివిటీల ద్వారా వివరించారు. అదేవిధంగా గ్రౌండ్ టెక్నిక్ ద్వారా అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు మానసిక ప్రశాంతతను ఎలా పొందాలో ప్రయోగాత్మకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్