మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తాగడానికి గుక్కెడు నీళ్లివ్వండి ...

1 గంట క్రితం

Please give me a mouthful of water to drink...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనంతపురం : ఎల్ నినో ప్రభావంతో .... వర్షాకాలంలోనూ చెరువులు ఎండిపోతున్నాయి.. దీంతో పలు గ్రామాలు నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లివ్వండి అంటూ .... మంగళవారం రెడ్డిపల్లి గ్రామ మహిళలంతా ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర స్థాయిలో నీటి ఎద్దడి నెలకొంది. రెడ్డిపల్లె గ్రామంలో రెండు నెలలుగా మంచినీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కొంటున్నట్లు మహిళలు వాపోయారు. అధికారుల దృష్టికీ తీసుకెళ్లినప్పటికీ తమ సమస్యకు పరిష్కారం చూపలేదని తెలిపారు. అధికారుల తీరును నిరసిస్తూ మహిళలు రోడ్డు పై నిరసనకు దిగారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్