అనంతపురం : బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని మిడుతూరు వద్దకు రాగానే బస్సులో పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. 33 మంది ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దిగారు. క్షణాల్లోనే బస్సు మొత్తం దగ్ధమైంది. ప్రాణ నష్టం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రైవేటు బస్సు దగ్ధం - తప్పిన పెనుప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 09:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)