ప్రభుత్వ సేవలందక ప్రజల అవస్థలు
ప్రజాశక్తి - ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల వ్యాప్తంగా పంచాయతీలోని గ్రామ సచివాలయంలో అసలు సేవలు ప్రజలకు అందుతున్నాయా? లేదా? అనే సందేహం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది లేక ప్రజలు ప్రభుత్వ పథకాలు పెట్టుకోవటానికి అవకాశం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల స్థలాలు, ఇతర సేవలకు సచివాలయాల చుట్టూ తిరిగి ప్రజలు అలసిపోతున్నారు. సచివాలయానికి సిబ్బంది లేక తాళాలు వేస్తున్న పరిస్థితి నెలకొంది. సచివాలయంలో సిబ్బంది లేక, ప్రజలకు సేవలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారా? ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యలో సచివాలయ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ తర్వాత నగర పంచాయతీలో ఏర్పడిన సిబ్బంది కొరత నేటి వరకు అదే పరిస్థితి కొనసాగుతుంది. నగర పంచాయతీలో ఉన్న అన్ని సచివాలయాల పరిస్థితి దాదాపు అంతే. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి, సిబ్బంది కొరతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.








కామెంట్‌లు (0)