సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శిథిలావస్థలో తాసిల్దార్ కార్యాలయం

18 గంటల క్రితం

Tahsildar office in a dilapidated state.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 03:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బిక్కుబిక్కుమంటున్న ఉద్యోగులు


ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించే తాసిల్దార్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. స్లాబ్‌ సీలింగ్‌ పెచ్చులూడిపోవడంతో ఉద్యోగులు, బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని శాఖల్లో అయితే సీలింగ్‌ చేయించుకున్న గదులలో స్లాబ్‌ పెచ్చులు ఊడి ఆ సీలింగ్‌ మీద పడడంతో అవి కూడా విరిగిపోయి ఉండడంతో సినిమా సెట్టింగ్‌ను తలపిస్తున్నాయి. ఎలక్ట్రికల్‌ వైర్లు పొట్టలో పేగులు మాదిరి మెలికలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. కొన్ని విభాగాలకు వెళ్తున్న మార్గాల్లో శిథిలమైన స్లాబ్‌లు, పెచ్చులూడిపోయిన గోడలు దర్శనిస్తున్నాయి. తాసిల్దార్ సాంబార్ పక్కన ఉన్న రికార్డ్ రూమ్ డిప్యూటీ తాసిల్దార్ పక్కన ఉన్న బాత్రూంలో అయితే మరి దారుణంగా ఉంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు ఇచ్చేందుకు మండలా నుంచి ప్రజలు ఏ క్షణం స్లాబ్‌ పెచ్చులూడిపోయి పైన పడతాయోనని ఆందోళన చెందుతున్నారు. వినతులు ఇచ్చేందుకు వస్తున్న ప్రజలు ఈ దృశ్యాలను చూసి ఇదేమి తాసిల్దార్ కార్యాలయం రా బాబు అనుకుని ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని శాఖల కార్యాలయాల్లో సైతం పెచ్చులూడిన స్లాబ్‌లు దర్శనమిస్తుండడంతో ఎవరికి చెప్పుకోవాలని అధికారులు ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆయా ప్రదేశం కుర్చీలను ఖాళీ చేసి వేరే చోట ఒక మూలన కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్