ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పి. సిద్దరాంపురం పంచాయతీ సర్పంచ్ ఎర్రిస్వామిని సన్మానించిన టిడిపి నాయకులు

17 గంటల క్రితం

TDP leaders felicitated P Siddarampuram Panchayat Sarpanch Erriswamy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆత్మకూరు (అనంతపురం) : పి.సిద్ధారాంపురం నూతన పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన చిండ్రెడ్డి ఎర్రిస్వామిని శనివారం స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో సర్పంచ్ గెలిపించిన పి సిద్ధిరాంపురం గ్రామ ప్రజలకు కృషిచేసిన టిడిపి నాయకులకు కార్యకర్తలకు కూడా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పి సిద్ధరాంపురం సర్పంచ్ చిడ్రె రెడ్డి ఎర్రిస్వామి మాట్లాడుతూ ఈ సిద్ధరాంపురం పంచాయతీ ప్రజలు తనపై నమ్మకం ఉంచి మంచి మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు మండల ఇంచార్జ్ బాలాజీ సహకారంతో పి సిద్ధరాంపురం పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్