శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కల్తీ మిఠాయిల విక్రయాలను అరికట్టాలి

1 గంట క్రితం

కల్తీ మిఠాయిల విక్రయాలను అరికట్టాలి: రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసులు. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 05:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాసులు

ప్రజాశక్తి-రాయదుర్గం : దీపావళి పండుగ సందర్భంగా మిఠాయిల విక్రయాలు అధికంగా జరిగే నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్వీట్ షాపులు, మిఠాయిల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.శ్రీనివాసులు కోరారు. పండుగ సమయంలో కల్తీ నెయ్యి, నాణ్యతలేని కోవా, నాసిరకం పాల ఉత్పత్తులు, అనుమతులు లేని కృత్రిమ రంగులతో మిఠాయిలు తయారు చేసి విక్రయించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్ షాపులు, తయారీ కేంద్రాలు, హోల్‌సేల్ గోదాములపై తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద మిఠాయిల నమూనాలను ప్రయోగశాలలకు పంపించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరారు. ప్రజలు కూడా మిఠాయిలు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత, తయారీ తేదీ, వినియోగం గడువు, ఎఫ్ఎస్ఎస్ఎఐ వివరాలను పరిశీలించి బిల్లు తీసుకోవాలని సూచించారు. పండుగ ఆనందం కోసం ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, కల్తీ ఆహారంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్