గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేడియాలజీలో డాక్టర్ రజితకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్

4 గంటల క్రితం

University Gold Medal for Dr Rajitha in Radiology
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 04:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అభినందించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, హెచ్‌ఓడీ డాక్టర్ సురేష్


ప్రజాశక్తి - అనంతపురం : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన పీజీ పరీక్షల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల రేడియాలజీ విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ రజిత రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి యూనివర్సిటీ గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రేడియాలజీ విభాగాధిపతి ఆచార్య డాక్టర్ సురేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం. విజయశ్రీ తన ఛాంబర్‌లో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించి డాక్టర్ రజితను పుష్పగుచ్ఛం, శాలువాతో ఘనంగా సత్కరించారు. రేడియాలజీ విభాగంలో తొలి బ్యాచ్ విద్యార్థిని యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించడం అనంతపురం వైద్య కళాశాలకు గర్వకారణమని, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ప్రిన్సిపాల్ అన్నారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో అధ్యాపకులు అందిస్తున్న నాణ్యమైన బోధన, శిక్షణ వల్లే విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని డాక్టర్ విజయశ్రీ తెలిపారు. ఇదే స్ఫూర్తితో కళాశాలలోని అన్ని విభాగాలు పనిచేసి మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేష్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ మనోరంజన్ రెడ్డి, డాక్టర్ రాజేంద్ర నాయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ వెంకట కళ్యాణ్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, డాక్టర్ నిహారిక, సీనియర్ వైద్యులు డాక్టర్ నలిని, డాక్టర్ స్నేహిత, పీజీ వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్