సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి క్రీడకు ఎంపికైన రంజిత్‌

2 రోజుల క్రితం

రాష్ట్రస్థాయి క్రీడకు ఎంపికైన హెచ్ .  రంజిత్
బొమ్మనహల్ image 1

విద్యార్థి రంజిత్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయ బృందం రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్‌ ‌పోటీలకు ఎంపిక

వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బొమ్మనహాల్

అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌ మండలంలోని సింగానహళ్లి జడ్పీ హైస్కూల్‌‌కు చెందిన పదో తరగతి విద్యార్థి హెచ్.రంజిత్ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్‌ ‌పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం రమేష్‌నాయుడు, పిఈటి జగదీష్ తెలిపారు. పాఠశాలలో శుక్రవారం హెచ్‌ఎం, పిఇటితో పాటు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు రంజిత్‌‌ను అభినందించారు. హెచ్‌ఎం మాట్లాడుతూ మారుమూల గ్రామంలో చదువుతున్న రంజిత్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమ‌న్నారు. రంజిత్‌ ‌భవిష్యత్తులో దేశ, విదేశీ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పిఇటిని ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్