ప్రజాశక్తి-అనంతపురం రూరల్
ప్లాస్టిక్ నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ ఎంపిడిఒ వెంకట నాయుడు సూచించారు. మంగళవారం రాచానపల్లి పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ భూతాన్ని అంత అంతమొందిస్తేనే భావితరాలకు పర్యావరణాన్ని అందించవచ్చన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ సాంప్రదాయ వస్తువులను వినియోగించాలన్నారు. తమ పరిసరాల్లో చెత్తను ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా పంచాయతీ సిబ్బందికి చెత్తను అందించాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీకి పలు రకాల స్టీల్ పాత్రలను అందించారు. ఏవైనా ఫంక్షన్లు, శుభకార్యాలు జరిగినప్పుడు స్టీల్ పాత్రలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేంద్ర, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డిప్యూటీ ఎంపీడీవో వెంకట నాయుడు








కామెంట్‌లు (0)