ప్రజాశక్తి కళ్యాణదుర్గం రూరల్
మత్తుకు అలవాటు పడితే జీవితాలు చిత్తు అవుతాయని జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు చిత్తప్ప అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు చిత్తప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీ సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేసి మద్యపానం, గంజాయి నిషేధించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యపానం, డ్రగ్స్ ముసుగులో దేశం చాలా నష్టపోతోందన్నారు. మద్యపానం, గంజాయి ప్రత్యక్షంగా ఆరోగ్యానికి హానికరం అన్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తుందన్నారు. కావున వాటికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక గౌరవ సలహాదారు, విశ్రాంత ఆంగ్ల ఆధ్యాపకులు మల్లికార్జున, గాయకులు భగవాన్‌దాస్, జెవివి నాయకులు శ్రీనివాసులు రాజన్న, సిఐటియు నాయకులు అచ్యుత్, గ్రేడ్ వన్ హాస్టల్ వార్డెన్ నాగరాజు, సతీష్, గోవింద్, విద్యార్థులు పాల్గొన్నారు.
అవగాహన అవగాహన కార్యక్రమం ర్యాలీలో జె వి వి నాయకులు








కామెంట్‌లు (0)