ప్రజాశక్తి-పుట్లూరు
జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం తన కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతి, సమానత్వం, సేవా భావం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో అహింసా మార్గాన్ని ఆయుధంగా చేసుకుని దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ








కామెంట్‌లు (0)