మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి జ్ఞానేశ్‌కుమా‌ర్‌ను తొలగించా‌ల్సిందే..: వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు

02 అక్టోబర్, 2026

సిఇసి జ్ఞానేశ్‌కుమా‌ర్‌ను తొలగించా‌ల్సిందే..
వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 06:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంతకల్లు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమా‌ర్‌‌ను వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీప్రసాద్, కార్యదర్శివర్గ సభ్యులు సాకే నాగరాజు, కసాపురం రమేష్, రంగమ్మ డిమాండ్‌ ‌చేవారు. ఈమేరకు శుక్రవారం వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనలు నిర్వహించారు. ఇందులో భాగంగా సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను దెబ్బతీసి పౌరహక్కులను కాలరాస్తూ దేశంలో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించిన భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని ‌డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి ఉన్న ప్రస్తుత వ్యవస్థను తొలగించి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన సుప్రీంకోర్టు ప్రతిపాదించిన ఎంపిక కమిటీ ఆధారిత యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, సూరి, తిమ్మప్ప, ఆటో యూనియన్ శివ, వెంకీ, డానియల్, జాషువా, కిష్టప్ప, మస్తాన్, ఈరన్న, మహిళా సంఘం నాయకురాలు సుగుణ, ఆదిలక్ష్మి, రాణి, లక్ష్మి, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, వైకాపా, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బి.గోవిందు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు బి.మహేష్, మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాసులు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ఎండి గౌస్, వైసిపి పట్టణ అధ్యక్షులు ఖలీల్, యూత్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ బాషీద్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆలం నవాజ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్