శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జిల్లా వ్యాప్తంగా జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలు దహనం

1 గంట క్రితం

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగించాలంటూ మిన్నటిన నిరసనలు
 జిల్లా వ్యాప్తంగా జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మలు దహనం ఆందోళన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనంతపురం కలెక్టరేట్ : దేశంలో ఓట్‌ చోరీ‌కి అడ్డుకట్ట వేయాలని, సిఇసి జ్ఞానేష్‌కుమా‌రను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కార్మికసంఘాల ఆధ్వర్యంలో కూడేరు మండలంలో నిరనస తెలిపారు. ఇందులో భాగంగా ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో జ్ఞానేష్‌కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ‌కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి, వ్యకాసం మండల అధ్యక్ష, కార్యదర్శులు రాధాకృష్ణ, మల్లికార్జున, రైతుసంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశులు, వీరప్ప, మేకలు పెద్దన్న, రైతు కూలిసంఘం నాయకులు సంజప్ప, తదితరులు పాల్గొన్నారు.

అలాగే గార్లదిన్నె మండల కేంద్రంలోని కోటంక బస్టాండ్ సర్కిల్లో జ్ఞానేషకుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి సి.చెన్నారెడ్డి, రైతుసంఘం నాయకులు నారాయణరెడ్డి, చెన్నారెడ్డి, సుధాకర్, ఆదెప్ప, రైతులు ఓబులేసు, రాము, సుబ్బన్న, ఎర్రపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

గార్లదిన్నె మండలం కోటంగ గ్రామంలో సిఇసి జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతు సంఘం నాయకులు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్