బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వార్డు రిజర్వేషన్లు ఖరారు - మున్సిపల్ చైర్ పర్సన్ అన్ రిజర్వ్

1 గంట క్రితం

వార్డు రిజర్వేషన్లు ఖరారు
మున్సిపల్ చైర్ పర్సన్ అన్ రిజర్వ్ 
రాయదుర్గం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రాయదుర్గం

రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాయదుర్గం పురపాలక సంఘంలో వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానం అ‌న్‌రిజ‌ర్వుడ్‌ కాగా వార్డుల రిజర్వేషన్ ‌ఈవిధంగా ఉంది. మొత్తం 40 వార్డులు ఉండగా అందులో ​15వ వార్డు-ఎస్టీ జనరల్, 28వ వార్డు-ఎస్సీ మహిళ, 19, 24వ వార్డులు- ఎస్సీ జనరల్, 3, 6, 7, 9, 37, 38, 39, 40వ వార్డులు- బీసీ మహిళ, 1, 2, 8, 11, 30, 34, 35, 36వ వార్డులు- బీసీ జనరల్, 4, 5, 12, 13, 14, 16, 21, 22, 27, 29, 31వ వార్డులు-జనరల్ మహిళ, 10, 17, 18, 20, 23, 25, 26, 32, 33వ వార్డులు అన్‌ రిజ‌ర్వుడ్‌‌గా కేటాయించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్