బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

*వైసీపీకి షాక్.. గుమ్మనూరు సమక్షంలో టీడీపీలోకి 103 కుటుంబాల చేరిక*

1 గంట క్రితం

*వైసీపీకి  షాక్.. గుమ్మనూరు సమక్షంలో టీడీపీలోకి 103 కుటుంబాల చేరిక* image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 06:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పామిడి

పామిడిలో వైసిపికి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పామిడి సాకే ఓబులేసు బుధవారం వైసిపికి రాజీనామా చేసి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ ‌సమక్షంలో టిడిపిలో చేరారు. ముందుగా ఎమ్మెల్యే పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పామిడి సాకే ఓబులేసు గజమాలతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌, గుమ్మనూరు ఈశ్వ‌ర్‌ను సత్కరించారు. అక్కడి నుం‌చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ర్యాలీగా పిజిఆర్ ఫంక్షన్ హాల్ చేరుకుని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం, గుత్తి, పామిడి మండలాల టిడిపి ఇన్‌‌ఛార్జి గుమ్మనూరు ఈశ్వర్, కార్మిక శాఖ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో సంత మార్కెట్, నెహ్రూనగర్‌కు చెందిన సుమారు 103 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరాయి. వారికి ఎమ్మెల్యే టిడిపి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ‌సిఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా అధికార కూటమిలో చేరుతున్నారన్నారు. ప్రభుత్వ పాలన, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఈ చేరికలే నిదర్శనమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టిడిపిలోకి వలసలు కొనసాగుతున్నాయని, ఇది ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇస్తున్న మద్దతును సూచిస్తోందన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రభాకర్ చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవ కుమార్, రాజగోపాల్, రంగస్వామి, గౌస్, జయరామ్‌రావు, లాయర్ ప్రసాద్, ఓబులేసు, మోహన్, సురేష్ రెడ్డి, వెంకటేష్, శ్రీరాములు, రఘు, రామాంజులునాయక్, రఫీ, కొండాపురం రఫీ, రామాంజనేయులు, లా‌లెప్ప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్