శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం: మంత్రి సవిత

42 నిమిషాల క్రితం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం: మంత్రి సవిత
◆అట్టహాసంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పెనుకొండ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ విజయానికి బాటలు వేస్తాయని తెలిపారు. పెనుకొండ మున్సిపల్ ఛైర్మన్, 23 కౌన్సిలర్లు, జడ్పీటీసీ, 5 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఎంపీటీసీ అభ్యర్థులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టిడిపి అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యాయన్నారు. ప్రజల ఆదరణతో నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలతో మమేకమై పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్