సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు

2 గంటల క్రితం

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 07:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాట్రేనికోన:

మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన గచ్చకాయలపొర, నీళ్లరేవు గ్రామాలలో అమలాపురం ఆర్డీఓ ఏ.సరళవతి సోమవారం పర్యటించారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, స్థానిక రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో భద్రతా చర్యలను సమీక్షించారు. తీరప్రాంత గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. సముద్ర తీర ప్రాంతంలో తుపాన ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. నక్కపల్లి పరిసర ప్రాంతాల నుండి ఇక్కడికి చేపల వేట కోసం వలస వచ్చిన మత్స్యకారులతో ఆర్డీఓ మాట్లాడారు. వారిని గచ్చకాయలపొర తుపాను పునరావాస కేంద్రానికి తరలిరావాలని ఆదేశించారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.


రానున్న ఆర్నాబ్ తుఫానును దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం అమలాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఏ. సరళావతి, ముమ్మిడివరం సి.ఐ యం.మోహన్ కుమార్, స్థానిక రెవిన్యూ అధికారులు, మత్స్యశాఖ అధికారులతొ కలిసి మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన గచ్చకాయలపోర, నీళ్లరేవు గ్రామాలలో పర్యటించి పునరావాస కేంద్రాలు పరిశీలించి ఆర్నాబ్ తుఫాన్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, తీసుకొన్న చర్యలను పరిశీలించినారు.


అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ తీర ప్రాంతం కావడంతో తుఫాను ప్రభావితం ఎక్కువగా ఉంటుందని, తక్షణమే ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళవలసిందిగా సూచించారు. అనంతరం తుఫాను ప్రభావం పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి నుండి వలస వచ్చిన మత్స్యకారులతో మాట్లాడి గచ్చకాయల పొర తుఫాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి రావలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రవికిరణ్, ఎంపీడీవో రాజేశ్వరరావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్