ప్రజాశక్తి-తాడిపత్రి
నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జెసి అస్మిత్‌రెడ్డి అన్నారు. మున్నిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఆయా అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి కేవలం ఓట్ల అభ్యర్థనకే పరిమితం కాకుండా ప్రతిఇంటికీ వెళ్తూ ప్రజల సాధకబాధకాలు, దీర్ఘకాలిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రితోపాటు నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి కార్యకర్తలు, జేసీ కుటుంబ అభిమానులు భారీసంఖ్యలో పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)