కవిటి: తుపాను ప్రభావంతో కపాసుకుద్ధి వంక వీధిలో రుక్మిణమ్మకు చెందిన మట్టిగోడ కూలి పక్కనే ఉన్న బడే బాలమ్మ ఇంటిపై పడటంతో ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. రెండు కుటుంబాలూ నిరుపేద కుటుంబాలే. దీనికితోడు బాలమ్మకు పూర్తిస్థాయిలో కంటిచూపు లేకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక వరక గ్రామంలో గూనోనిధి దొళాయికి చెందిన మట్టిగోడ సైతం కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాధిత కుటుంబాలను అధికారులు ఆదుకుని, నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.









కామెంట్‌లు (0)