గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎంతోనే ప్రజా సమస్యల పరిష్కారం...సిపిఎం కౌన్సిలర్‌ అభ్యర్థి నిర్మల

1 గంట క్రితం

సిపిఎంతోనే ప్రజా సమస్యల పరిష్కారం
సిపిఎం కౌన్సిలర్‌ అభ్యర్థి వి.నిర్మల image 1

గుత్తిలోని గుట్టమీద కాలనీలో ఓటర్లను అభ్యర్థిస్తున్న సిపిఎం నాయకులు

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 06:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుత్తి

మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి వి.నిర్మలను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని 24 వ వార్డు కౌన్సిలర్ సిపిఎం అభ్యర్థి వి.నిర్మలతో కలిసి ‌స్థానిక బీసీ కాలనీ, గుట్టమీద కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు చేసే సిపిఎం బలపరిచిన అభ్యర్థి వి.నిర్మలను గెలిపించాలన్నారు. 24 వ వార్డులోని కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ సుత్తి-కొడవలి- నక్షత్రం గుర్తుకు ఓటు వేసి వి.నిర్మల ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సి.రమేష్, ఎన్.రేణుక, ఎం.మల్లేష్, యు.మల్లికార్జున, షేక్ మున్నీ, వన్నూరమ్మ, ఊర్మిళ, జయమ్మ, నారాయణస్వామి, ఎస్ఎఫ్ఐ నాయకులు నవీన్‌యాదవ్, వంశీ, నూ‌ర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్