ప్రజాశక్తి - అంబాజీపేట
అర్నబ్ తుపాను కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయి గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయి. తుపాను ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకూలి, వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఈ విషయంపై అంబాజీపేట మండల ఎలక్ట్రికల్ ఎఇ పి.కవిత ను గురువారం ప్రజాశక్తి వివరణ కోరగా ఆమె స్పందించారు. తుపాను కారణంగా మండల వ్యాప్తంగా సుమారు 250 విద్యుత్ స్తంభాలు పడిపోయినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం 200 స్తంభాలతో పాటు విద్యుత్ వైర్లు, ఇతర సామగ్రి అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఎఇ సుజాత మాట్లాడుతూ విద్యుత్ పునరుద్ధరణ కోసం అధికారులు కాకుండా సిబ్బంది సుమారు 70 మందితో నిరంతరం పనులు చేపడుతున్నామని అన్నారు. పట్టణ కేంద్రంలో ముఖ్య కార్యాలయాల్లో ముందుగా విద్యుత్ ఇచ్చే విధంగా పనులు చేపట్టామన్నార. మండల క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇవ్వడానికి మరో నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తుపాను వల్ల ప్రజలు ఇబ్బందులు, ఎన్నికల పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని త్వరలోనే పూర్తిగా విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని ఎఇ కవిత తెలిపారు.








కామెంట్లు (0)