సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆత్మకూరు మండల సమైఖ్యా లో అసలేం జరుగుతోంది..?

2 రోజుల క్రితం

What exactly is happening in the Atmakur Mandal Samakhya?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 01:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వెలుగులోకి వచ్చిన సంబంధిత సీ.సీ సస్పెండ్..?

అంతర్మధనం లో ఆత్మకూరు మండల సమాఖ్య...!


ప్రజాశక్తి ఆత్మకూరు (అనంతపురం) : 2025 -26 కు సంబంధించి ఆత్మకూరు మండలం సమైక్య లోని ఆత్మకూరు క్లస్టర్ నందు గల మంజూ శ్రీ గ్రామైక్య సంఘంలో, అప్పటి సీసీ సంఘం మహిళా సభ్యులకు రుణాలు, లబ్ధిదారుల ఫోటోల అవతవకులు మంజూరు చేయడంలో అవినీతి అక్రమాలు జరిగాయనే సమాచారంతో, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు విచారణలో బట్టబయలు అయినట్టు మండల వ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే గతంలో పనిచేసిన సిసి వెంకటనారాయణ సస్పెండ్ చేసినట్లు విశ్వసినీయ సమాచారం. అయితే ఆత్మకూరు మండల వ్యాప్తంగా మహిళా సంఘ సభ్యులు ఆ నోట ఈ నోట చర్చించుకోవడమే తప్ప, సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఏమీ జరిగనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రజాశక్తి దినపత్రికకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు, సంబంధిత సీసీ నిర్లక్ష్య వైఖరి వల్ల జరిగిన అక్రమాలు బహిర్గతం కావడంతో, రాష్ట్రస్థాయి అధికారుల నుంచి, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ గారిని, విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్య వైఖరి నవలంబించి, రుణాల అక్రమాలు, లబ్ధిదారుల ఫోటో అవుతవకల పై,వెనుక దాగి ఉన్న ప్రధాన కారకుడైన సంబంధిత ని సస్పెండ్ చేయమని ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయమై సంబంధిత మండల ఏపీఎం ను వివరణ కోరగా, అలాంటిదేమీ జరగలేదని మాట జవ దాటుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా మహిళా సంఘాలు మాత్రం రుణాలు మంజూరుల అక్రమాలు జరగాయనడం,సీసీ ను సస్పెండ్ చేయడం, గూర్చి బహిర్గతంగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా గత 10 ఏళ్ల క్రితం కూడా, ఇదే గ్రామ సంఘంలో సిఐఎఫ్, స్త్రీ నిధి రుణాలు మంజూరు లో కూడా, అక్రమాలు తోటి చేసుకోవడం కాకుండా, నాయకుల పెత్తందారు వ్యవస్థతో, రికవరీ కూడా చేయలేకపోవడం విచారకరం అని గ్రామ సంఘాల్లో చర్చనీ అంశంగా మారింది. కావున ఆత్మకూరు మండల సమైక్య మహిళా సంఘాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలు పై విచారణ జరిపి, న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామ సంఘాల సభ్యులు వాపోతున్నారు.


జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా...

మండల సమైక్య ఆధీనంలోని గ్రామ సంఘాలు జరుగుతున్న అవినీతి అక్రమాలు జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతున్నాయని ప్రత్యక్షంగా చెప్పవచ్చును. గతంలో ఏపీఎంల పై అధికారం ఏరియా క్లస్టర్ అధికారులకు ఉండేది. ఏ సమస్య వచ్చినా మండల ఏపీఎం తర్వాత, ఏరియా కోఆర్డినేటర్ ఏ సీ పర్యవేక్షణ చేసి, విచారించేవారు. వారిని తొలగించిన తర్వాత, పర్యవేక్షణ లోపం ఏర్పడిందని, సంబంధిత శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. మండల ఏపిఎం చెప్పింది వేదవాఖ్యంగా, చేసింది వేదమంత్రంగా, నిర్వాకం కొనసాగడం వల్ల, గ్రామ సంఘాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఏదేమైనా ఆత్మకూరు మండల సమైక్య పరిధిలోని గ్రామ సంఘాల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై, రుణ లబ్ధిదారుల ఫోటో అవతవకలు పై విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చును. ప్రస్తుతం మంజుశ్రీ గ్రామ సంఘంలో జరిగే అవినీతి, అక్రమాలు వెనుక సిసి సస్పెండ్ పై మరింత విచారణ చేయాల్సిన అవసరం వుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్