ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : మండలంలో వైసిపి పార్టీ నాయకులు వైపల్యం కారణంగా స్థానిక సంస్థలు ఎంపిటిసి, జెడ్పిటీసీ ఎన్నికల్లో వైసిపి పార్టీ అప్రతిష్ట పాలౌతోందని ఆత్మకూరు వైసిపి నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఆత్మకూరు మండలంలో సరైన నాయకత్వం కలిగిన వైసీపీ నాయకులు పార్టీలో లేనందువలనే సంబంధిత వైసిపి పార్టీకి త్రీవ నష్టం జరుగుతున్న మండల లోని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల ప్రాదేశిక ఎన్నికల్లో నాలుగు ఎంపిటిసి స్థానాలు తిరస్కరణ కు గురి కావడమే ఇందుకు కారణమైనదని ఆత్మకూరు మండలంలోని వై. సి.పి వర్గాలు అంతర్మధనం పడుతున్నాయి . వైసీపీ పార్టీ అనుబంధ సంఘాలు, నాయకులు స్వార్థం వలన పార్టీ బలహీన పడుతుందని స్థానిక క్యాడర్ ఆవేదన వ్య క్తం చేస్తున్నారు . అయితే మండలం లో టీడీపీ ప్రతిపక్షం లో ఉన్నపుడు కానీ అధికారంలో కి వచ్చి నప్పటి కీ, ప్రస్తుత అధికార పార్టీ నాయకులు, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని, పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల కోసం కష్టపడుతూ పార్టీ బలహీన పడుకుండాచూసుకుంటున్నారు.కానీ ప్రస్తుత ప్రతి పక్షము లో ఉన్న వైసీపీ నాయకత్వం అధికారం లో ఉన్నప్పుడు కానీ, ప్రతి పక్షము లో కానీ ఈ పాఠాలు నేర్వని పరిస్థితి ఉంది. స్థానిక సంస్థలు ప్రాదేశిక ఎన్నికల్లో వైసీపీ నాయకుల వైపల్యం కారణoగా అధికార పార్టీ ఏకంగా నాలుగు ఎం పీ టి సీ స్థానాలు ఏకగ్రీవంగా చేసుకుంది. కావున గ్రామ పంచాయతీ నామీనేషన్ ప్రక్రియ ప్రారంభం లోపు అయినా పార్టీ క్యాడర్ ర్ ను సమన్వయం చేసి గ్రామ స్థాయిలో వైసీపీ బలోపేతం చేసేందుకు ఇప్పటికైనా వైసీపీ నియోజకవర్గం, జిల్లా, వైసీపీ అధిష్టానం మండలం లో బలహీనపడుతున్న వైసీపీ ని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ అభిమానులు నుంచి వినిపిస్తున్నాయి .
స్థానిక సంస్థలు ఎన్నికల్లో వైసీపీ నాయకత్వ లోపంతో వైసీపీ విఫలం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 26, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)