ప్రజాశక్తి - యద్దనపూడి : మండలంలోని అనంతవరం గ్రామములోని ఎంపీపీ స్కూల్ (ఎ.ఎ )నందు మంగళవారం తిరుపతి అర్షిత తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు, అంగన్వాడి సెంటర్‌లోని విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టింది. ఇది మంచి సాంప్రదాయంగా కొనసాగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.రవికుమార్ అన్నారు. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారికి పిల్లలందరూ అభినందనలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని లీజర్ సమయంలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఎవరిది పుట్టినరోజు అయితే వారు స్వీట్లు గాని లేదా కేకులు పంచిపెడుతున్నారని అన్నారు. .ఒక్కో రోజు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల పుట్టినరోజులు ఉంటాయాని హెచ్.యం చెప్పారు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలుతో వచ్చి ఇతర పిల్లలకు చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చి ఆనందింపచేస్తున్నారని అన్నారు. తోటి విద్యార్థులు వర్షిత, అను, వందన, పునర్విక, విక్రమ్, అన్షు, అహల్య, నవదీప్, స్మైలి, వరుణ్,మిక్కి, కౌషిక్ అర్షితకు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థుల్లో సందడి నింపుతున్న ‘పుట్టినరోజు పండుగలు’
15 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)