ప్రజాశక్తి - యద్దనపూడి : పర్చూరు మండల లోని నూతలపాడు గ్రామపంచాయతీ నందు మంగళవారం చెత్త నుండి సంపద తయారీ కేంద్రమును ఎక్స్ పోజర్ విజిట్ లో భాగంగా యద్దనపూడి మండల ఎం పీ డీ ఒ బి.శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఆయనతో పాటు యద్దనపూడి మండలంలోని 14 పంచాయతీల అభివృద్ధి అధికారులు, గ్రీన్ అంబాసిడర్లు ఉన్నారు. పర్యటనలో భాగంగా అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. నాణ్యమైన వర్మీ కంపోస్టు ఉత్పత్తి ప్రక్రియ వేగవంతం చేయవలసినదిగా ఆదేశించారు. రాబోయే కాలంలో యద్దనపూడి మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో 1000 కేజీల నాణ్యమైన వర్మీ కంపోస్తూ తయారీ చేయుటకు తగిన చర్యలు తీసుకొనవలసినదిగా అధికారులను ఆదేశించారు. ఈ .కార్యక్రమంలో యద్దనపూడి సచివాలయ, పంచాయతీ అభివృద్ధి అధికారులు దొప్పలపూడి మోహన్ బాబు, కె బాబురావు, తేజ శివ ప్రసాద్, శ్రీకాంత్, కె శ్రీను, నాగేష్,అశోక్, సాయి కుమార్, శరత్ కుమార్,రఫీ, ప్రభాకర్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్ పోజర్ విజిట్
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)