ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : హైదరాబాదులోని బిర్లా ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక రంగంలో, గ్రంధాలు రచించడం, సాహితీవేత్త , వ్యాఖ్యానాలు చేయడం లాంటి పై విశేష కృషి చేసిన పర్చూరు మండల ఎంఈఓ ఒకటి అల్లూరి శివ కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వారు, సినీనటి, దర్శకురాలు శిరీష రెడ్డి దుశ్శాలువాతో శివ కోటేశ్వరరావును ఘనంగా సత్కరించి కీర్తి చక్ర బిరుదును ప్రదానం చేశారు. సన్మాన గ్రహీత అల్లూరి శివ కోటేశ్వరరావు పర్చూరు మండల ఎంఈఓ ఒకటిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేశారు. మంచి ఉపన్యాసకులు. రచయిత అయిన ఈయన సుదర్శనం, అన్నమయ్య కీర్తనలు వ్యాఖ్యానం, శ్రీ గణేశ జై గణేశా, షోడశ సంస్కారాలు, శాంతులు, హనుమాన్ చాలీసా, ప్రదక్షణ పదేపదే, భజగోవిందం వ్యాఖ్యానం, శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతానికి గోవింద నామాలకు గోవిందం శ్రీ గోవిందం పేరుతో వ్యాఖ్యానాలు రచించారు. మేలిమి మాటలు, చిన్నపిల్లలకు నీతి మాటలు, కార్తీక మాస విశిష్టతలు తెలియజేయడమే కాకుండా దానిలో ఉండే లింగాష్టకము బిల్వాష్టకముల వ్యాఖ్యానం గ్రంథాలను ప్రచురించి పలువురు యాత్రికులకు అందజేశారు. అలాగే తెలుగు వెలుగు సాహితీ వేదిక వరంగల్ వద్ద స్వర్ణ కంకణ పురస్కారాన్ని శివ కోటేశ్వరరావుకు ప్రకటించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత అయిన అల్లూరిని పలువురు ఉపాధ్యాయులు, స్నేహితులు, మిత్రులు, బంధువులు, యాత్రికులు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.
సాహితీవేత్త అల్లూరి శివ కోటేశ్వరరావుకు ఘన సత్కారం
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 05:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)