ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంకొల్లులో జోరు వాన - రైతుల్లో ఆందోళన

19 గంటల క్రితం

Heavy rain in Inkollu farmers concerned
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 03:21 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఇంకొల్లు (బాపట్ల) : ఇంకొల్లులో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఈ వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఈ ఏడాది ఎల్‌ నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక ఖరీఫ్ రైతాంగం వేయలేకపోయింది. రబ్బి పంటలను సైతం ఆలస్యంగా వేయవలసి వచ్చింది. నవంబర్ మొదటి వారంలో మురుసు తుఫాను ప్రభావంతో వర్షాలు అంతటా పడ్డాయి. దీంతో రైతులు విత్తనాలు వేయటానికి సిద్ధమయ్యారు. అంతలోనే మళ్లీ ఆక్వాన్ తుఫాను ప్రభావం కోస్తా ప్రాంతంలో ఉందని వాతావరణ శాఖ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు వర్షం కోసం వేచి చూశారు. అయితే ఆ తుఫాను ప్రభావం పర్చూరు నియోజకవర్గంలో చూపించలేదు. అయితే రబ్బి సాగులో భాగంగా ఈపాటికి గత పది రోజుల నుంచి తమ దుక్కి భూములకు ఎరువులు ఎదబెట్టి, శెనగ,జొన్న నీరు అనువుగా ఉన్న ప్రాంతంలో మొక్కజొన్న సాగు కు విత్తనాలు వేశారు. ధైర్యంగా అక్వా తుఫాను గురించి ఆలోచించకుండా విత్తనాలు వెదజల్లిన రైతుల పొలాల్లో ఈపాటికి మొలకలు వచ్చాయి. దీనికి తోడు ఆలస్యంగా విత్తనాలు వేసిన రైతులు కూడా ప్రస్తుత వాతావరణంతో బెంబేలెత్తుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం ఇంకొల్లు, పరిసర ప్రాంతాలలో కొన్నిచోట్ల వర్షం పడింది. కొన్నిచోట్ల కొన్ని గ్రామాలలో అసలు వర్షం పడలేదు. ఇంకొల్లు పొరుగున ఉన్న నాగులుప్పలపాడు మండలం, చిన్నగంజాం మండలంలలో వర్షం కొన్ని ప్రాంతాలలో బాగా పడింది. నాగులుప్పలపాడు, కోర్సపాడు, ఒంగోలు తదితర ప్రాంతాలలో వర్షం ఎక్కువగా పడి ఈపాటికి పెట్టిన పైరులకు సంబంధించి విత్తనాలు మొలకలు దెబ్బ తిన్నాయి. ఆ వర్షం ఒక రకంగా ఇంకొల్లు, ఈ ప్రాంతంలో ఒక మోస్తరుగా కురవడం వల్ల మేలే అనుకుంటున్నప్పటికీ, మళ్లీ గత నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణ ప్రభావంతో వర్షాలు పడతాయని చెబుతున్నారు. దీంతో రైతులు కొద్దిమంది విత్తనాలు వేయని వారు వేచిచూసే ధోరణిలో ఉన్నప్పటికీ, వర్షం కొన్నిచోట్ల లేకపోవడంతో, గత మూడు రోజులుగా మళ్లీ రైతులు ఎరువులు,విత్తనాలు పెడుతున్నారు. అయితే శుక్రవారం ఇంకొల్లు గ్రామంలో ఉత్తర పొలం తూర్పు పొలం దక్షిణ పొలం వర్షం బాగా పడింది. ఇంకొల్లు ఒకవైపు పొలాలలో నీరు సైతం నిలబడింది. దీంతో విత్తనాలు మొలకలు వచ్చిన, ప్రస్తుతం, విత్తనాలు వెదబెట్టిన రైతుల్లో ఆందోళన మొదలైంది. మొలకలు దెబ్బతింటాయని మళ్లీ విత్తనాలు పెట్టవలసిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. వర్షాలు ఇంకా పడితే నష్టం ఇంకా ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప పొగ తోటలు వేసిన రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు.


మరోవైపు పేర్లకు కు కలుపు బెడద ..

ఇది ఇలా ఉంటే ముందస్తుగా విత్తనాలు పెట్టిన రైతులకు సంబంధించి పొలాల్లో మొలకలు వచ్చాయి. అయితే ఈ ఏడాది వర్షాలు లేవని విత్తనాలు పెట్టిన తరువాత రైతులు కలుపు మందు పిచికారి చేయలేదు. అనంతరం మారిన వాతావరణంతో వర్షాలు కురుస్తూ ఉండటంతో కలుపు బెడద తప్పదని వాపోతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్