ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కారులో పెట్రోల్‌ కొట్టించుకొని దుండగుడు పరార్ - కార్మికుడి పరిస్థితి విషమం

19 గంటల క్రితం

Miscreant flees after getting petrol filled in car worker in critical condition
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చీరాల జాతీయ రహదారిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద భారత్ పెట్రోల్ బంకులో ఘటన

రూ.4,200 పెట్రోల్‌ పోయించుకున్న వైనం

అడ్డుకునేందుకు వెంబడించిన బంకు వ్యక్తికి తీవ్ర గాయాలు

పరిస్థితి విషమం ఒంగోలుకు రిమ్స్ తరలింపు


ప్రజాశక్తి - చీరాల (బాపట్ల) : కారులో పెట్రోల్‌ పోయించుకుని డబ్బులు చెల్లించకుండా దుండగులు కారులో పరారైన ఘటన చీరాల ఒంగోలు జాతీయ రహదారిలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని ఉన్న భారత్‌ పెట్రోల్‌ బంకులో శుక్రవారం రాత్రి జరిగింది. ఎరుపు రంగు మారుతి స్విఫ్ట్‌ కారులో వచ్చిన ఓ వ్యక్తి రూ.4,200 విలువైన పెట్రోల్‌ పోయించుకున్నాడు. అనంతరం డబ్బులు చెల్లించకుండా కారుతో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బంకులో పనిచేస్తున్న బుర్లవారిపాలెంకు చెందిన చింత కరుణసాగర్‌ కారును అడ్డుకునేందుకు వెంబడించాడు. అయితే దుండగుడు కారు ఆపకుండా ఈచ్చుకెళ్లాడు. ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కరుణ సాగర్ పరిస్థితి విషమంగా మారింది. తొలుత చీరాలలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారులో నలుగురు దుండగులు ఉన్నట్లు నిందితులు ఎరుపు రంగు స్విఫ్ట్‌ కారులో ఒంగోలు వైపు పరారైనట్లు తెలుస్తోంది. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
011

02


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్