గురువారం, 27 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకృతి వ్యవసాయ పాయింట్ పర్సన్ శిక్షణ

1 గంట క్రితం

Natural Farming Trainingjpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 03:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - యద్దనపూడి ( బాపట్ల జిల్లా ) : యద్దనపూడి గ్రామములోని రైతు సేవ కేంద్రం వద్ద బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా ప్రకృతి వ్యవసాయ పాయింట్ పర్సన్ శిక్షణా కార్యర్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవ ఆధారిత ఇన్‌పుట్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం, వాటి వినియోగం, నాణ్యత, తయారీలపై రైతులకు సరైన విధంగా అవగాహన కల్పించడం ద్వారా మార్గదర్శకత్వం అందించారు.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింత విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించడంలో బయో రిసోర్స్ సెంటర్లు, పాయింట్ పర్సన్‌లు కీలక పాత్ర పోషించాలని, వారికి అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్ నిరంతరం అందుబాటులో ఉండేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా హెచ్. అర్ యన్ ఎఫ్ ఎ నందకుమార్ మాట్లాడుతూ రైతు సోదరులు అందరు కూడా బయో రిసోర్స్ సెంటర్ ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన వాటిని రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ సమయంలో భూమిని ఖాళీగా ఉంచకుండా పీఎండిఎస్ విత్తనాలు వేసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమం లో ఎఫ్. యం. టి లు కోటి బాబు, గోగినేని శ్రీనివాస్ రావు, బయో రిసోర్స్ సెంటర్ యజమానులు, పాయింట్ పర్సన్‌లు మరియు ప్రకృతి వ్యవసాయ ఐ. సి. అర్. పి లు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్