పేద రైతుల భూముల జోలికొస్తే సహించం..
ప్రత్యామ్నాయ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య
తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయింపు
ప్రజాశక్తి - మార్టూరు : పరిశ్రమల ఏర్పాటు పేరుతో పేద గిరిజన రైతుల సాగు భూములను స్వాధీనం చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సీహెచ్. గంగయ్య డిమాండ్ చేశారు. గిరిజన రైతుల భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయొద్దని, పరిశ్రమల కోసం వినియోగంలో లేని ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. మార్టూరు మండలం నాగరాజుపల్లి తాండాకు చెందిన గిరిజన రైతుల సాగు భూములను ఎంఎస్ఎంఈ పార్కు కోసం స్వాధీనం చేసుకునే చర్యలను నిరసిస్తూ మంగళవారం స్ధానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి బత్తుల హనుమంతరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగయ్య మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగా ఉన్న గిరిజన రైతుల భూములను నామమాత్రపు పరిహారంతో తీసుకోవాలని చూడటం అన్యాయమన్నారు.








కామెంట్‌లు (0)