శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రారంభమైన సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ..

18 నవంబర్, 2026

bapatal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులు

- చీరాల మండలంలో 7 కేంద్రాల ఏర్పాటు

- కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు

ప్రజాశక్తి - చీరాల: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. దీంతో సర్పంచ్ పదవులకు పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు చేరుకుంటున్నారు. చీరాల మండలంలో 15 పంచాయతీలకు జరుగునున్న సర్పంచ్ ఎన్నికలకు ఈపురుపాలెం, గవినివారి పాలెం,వాడరేవు, తోటవారిపాలెం,చీరాల నగర్, దేవాంగపురి, రామకృష్ణాపురం మొత్తం 7 నామినేషన్ కేంద్రాలను ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్