ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గోపి హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని వీరన్నపాలెం గ్రామంలో పేకాడుతున్న వ్యక్తులను అదుపులకు తీసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూదం, గంజాయి,మతపదార్థాలు అమ్మడం లాంటివి, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలో చట్టవిరుద్ధమైన జూదం కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత నెలలో మండలంలోని వివిధ గ్రామాల్లో 5 చోట్ల ప్రత్యేక దాడులు నిర్వహించి, 34 మందిపై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా దాడుల్లో సుమారు రూ.30 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. తేలికగా డబ్బు సంపాదించాలనే ఆశతో జూదంలో పాల్గొనడం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబ కలహాలు, అప్పులు, ఇతర నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. స్టేషన్ పరిధిలో జూదం, గుట్కా, గంజాయి, మత్తు పదార్థాల విక్రయం, బహిరంగ మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఏవైనా గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని ఎస్‌ఐ స్పష్టం చేశారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు : ఎస్సై గోపి
02 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)