శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూర్యలంక బీచ్‌లో ‘స్వచ్ఛ సాగర్–సురక్షిత సాగర్’ కార్యక్రమం

5 గంటల క్రితం

beach.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో శనివారం ఉదయం ‘స్వచ్ఛ సాగర్–సురక్షిత సాగర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజాంపట్నం కోస్టల్ గార్డ్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీచ్ పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్య, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించడం, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ గార్డ్ కమాండెంట్ సంకేత్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజశేఖర్ఆ, ర్డీఓ ఏ. హరికుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. విజయమ్మ, డీఈఓ శ్రీనివాస్ సింగ్, డీఆర్‌డీఏ పీడీ బి. సింగయ్య, సర్వశిక్ష అభియాన్ పీఓ శ్రీనివాసులు తదితర అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్