ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పర్చూరు రోటరీ క్లబ్ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని నాగులపాలెం గ్రామంలోని చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ ప్రక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వాకింగ్ ట్రాక్ పక్కన 100 కొబ్బరి మొక్కలు నాటమే కాకుండా వాటి పరిరక్షణకు ట్రీ గార్డులనుకుడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు గిరిధర గోపాల్ రెడ్డి,సభ్యులు మాట్లాడుతూ తమ రోటరీ క్లబ్ మరియు ఆర్ సి సి క్లబ్ నాగులపాలెం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ డైరెక్టర్ కొల్లా వీరయ్య చౌదరి ఆర్ధిక సహకారం తో 100 కొబ్బరి మొక్కలు వాకింగ్ ట్రాక్ ప్రక్కన నాటినట్లు వెల్లడించారు. నాగులపాలెం గ్రామస్తులు, రోటరీసభ్యులు మొక్కల రక్షణ కొరకు అవసరమైన ట్రీ గార్డులు కు ఆర్ధిక సహాయం అందించారని తెలిపారు . ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నాయుడు పేట డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ గొట్టిపాటి చెంచుబాబు, పర్చూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నాగభూషణం , సబ్ ఇన్స్పెక్టర్ పి గోపి , రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు ఆరె గిరిధర రెడ్డి, పాబోలు ఉదయ భాస్కర్, ఆర్ సి సి డైరెక్టర్ తేళ్ళ రమేష్ చంద్ర, మాజీ అసిస్టెంట్ గవర్నర్ నాగబైరు శ్రీనివాసరావు, ఆర్ సి సి ఉపాధ్యక్షులు చాగంటి నాగేశ్వరావు, టిడిపి నాయకులు కొల్లా శ్రీనివాసరావు,రోటరీ సభ్యులు, కోట హరిప్రసాద్ కోటా శ్రీనివాసరావుఆర్ సి సి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
02 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)