ఓటర్లుకు నగదు పంచుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రజాశక్తి -చీరాల : చీరాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వైసీపీ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు వసుమళ్ల వాసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విజ్ఞాన భారతి కాలేజీ వద్ద 17, 18వ వార్డుల పోలింగ్ బూత్‌ల సమీపంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న వాసును డీఎస్పీ ఎండి మోయిన్ అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు








కామెంట్‌లు (0)