ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

6 రోజుల క్రితం

auto acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 11:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–ఎస్‌ఆర్‌పురం: చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. డీకే మర్రిపల్లి గ్రామానికి చెందిన పలువురు నగిరి సమీపంలోని చత్రవాడ గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరారు. తిరుపతి రహదారిపై కటికపల్లి–కొత్తపల్లి మిట్ట మధ్యలోకి చేరుకున్న సమయంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్