ప్రజాశక్తి-పెద్దపంజాణి (చిత్తూరు) : డ్యూటీ ముగించుకొని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగి సందీప్ (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన శనివారం చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం రాయలపేట సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో బైరెడ్డిపల్లి మండలం ప్రాణాలు కోల్పోయాడు. బైరెడ్డిపల్లి మండలం కడపనత్తంలో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న సందీప్ నైట్ డ్యూటీ ముగించుకొని రాత్రి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన పెద్దపంజాని మండలం కెళవాతికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రాయలపేట సమీపానికి చేరుకోగా, ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పెద్దపంజాని పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్న వయసులోనే సందీప్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విధులు ముగించుకొని ఇంటికి చేరుకుంటాడని ఎదురుచూస్తున్న కుటుంబానికి ఈ ప్రమాద వార్త తీరని విషాదాన్ని మిగిల్చింది.
రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన బైక్ - విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 28, 2026, 03:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)