హత్య ? ఆత్మహత్యా ? - స్థానికులు ఆవేదన వ్యక్తం
ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి (చిత్తూరు) : మండలంలోని పెద్దచల్లారిగుంట పంచాయతీ పరిధిలోని ఓ వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన గురువారం వెలుగుచూసింది. స్థానికుల సమాచారం మేరకు బావి యజమాని ఎం.సురేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, కానిస్టేబుల్ రఘుపతి కలిసి బావి వద్దకు చేరుకుని పరిసరాలను పరిశీలించడంతో పాటు స్థానికులను విచారించారు. మృతదేహాన్ని గమనించిన పోలీసులు మృతుడి వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో మృతుడు బాసిన గోవింద (విజయనగరం)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గోవిందకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కుమార్తెకు సుమారు 60 రోజుల క్రితం మురారిపల్లికి చెందిన మంజునాథతో వివాహం జరిగినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. మృతదేహాన్ని బావి నుంచి వెలికితీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)